భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆసీస్ స్పిన్నర్లు విజృంభిస్తుండడంతో భారత్ కష్టాల్లో పడింది. 153 పరుగలకే 7 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ లియాన్ 5 వికెట్లు తీసి భారత్‌పై ఆధిపత్యం చెలాయించాడు. 66 పరుగులకే నాలుగు చేజార్చుకున్న భారత్‌ను కోహ్లీ-జడేజా జోడి ఆదుకుంది. ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఆదుకున్నారు. ఇక క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్లు కనిపించినా సమయంలో జడేజా(26), కోహ్లీ(44) వెంటవెంటనే ఔట్ అయ్యారు. మార్ఫీ బౌలింగ్‌లో జడేజా వికెట్ల ముందు దొరికిపోగా, అర్థసెంచరీ కన్నేసిన కోహ్లీ కొత్త స్పిన్నర్ కుహ్నెమాన్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. రిషబ్ పంత్ దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని శ్రీకర్ భరత్ (6) వినియోగించుకోలేక పోతున్నాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైనా శ్రీకర్ ఈ మ్యాచ్‌లో కూడా చేతులెత్తేశాడు. అక్షర్ పటేల్(5), అశ్విన్(9) క్రీజ్‌లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా కంటే భారత్ ఇంకా 110 పరుగుల వెనుకబడి ఉంది.