భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ తడబడుతోంది. టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న పుజారా (36) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. పుజారాకు తోడు శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నాడు. కోహ్లీ 13, రోహిత్ 12, జడేజా 7, గిల్ 5 మరోసారి నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 3, కున్‌మెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా కంటే భారత్ ఇంకా 9 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు ఉమేష్ యాదవ్, అశ్విన్ విజృంభించడంతో ఆస్ట్రేలియా 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో రోజు 156/4 స్కోర్‌తో ఆటను ప్రారంభించిన కంగారులు 41 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 88 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.జడేజా 4, అశ్విన్ 3,ఉమేష్ 3 వికెట్లతో రాణించారు.