భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. టీం ఇండియాను కేవలం 109 పరుగులకే కట్టడి చేసి బ్యాటింగ్ ప్రారంభించిన కంగారులు టీ బ్రేక్ సమయానికి ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేశారు. క్రీజ్ లో ఉస్మాన్ ఖవాజా(33), లబూషేన్ (16) ఉన్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ స్పిన్‌కు చేతులెత్తేసిన ఆస్ట్రేలియా ఈ సారి ఎదురొడ్డి నిలబడింది. 12 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయి.. రెండో వికెట్‌కు 59 పరుగులు చేసింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వికెట్లు కోసం శ్రమిస్తున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ స్పినర్లు భారత్ బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రధానంగా కునెమన్ 5 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా..లియాన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ముర్ఫీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. రాహుల్ స్థానంలో ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ 21 పరుగులు చేశాడు.రోహిత్ 12, పుజారా 1, అయ్యర్ 0, జడేజా 4 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. చివరిలో ఉమేష్ యాదవ్ విలువైన 17 పరుగులు చేశాడు.