India vs Australia 4th Test Match drawn
mictv telugu

నాలుగో టెస్ట్ డ్రా…సిరీస్ భారత్ వశం

March 13, 2023

India vs Australia 4th Test Match drawn

బోర్డర్ గావస్కర్ ట్రోఫి భారత్ వశమైంది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో సిరీస్‌ను టీం ఇండియా 2-1తో దక్కించుకుంది. ఆట చివ‌రి రోజున టీ బ్రేక్ త‌ర్వాత ఆస్ట్రేలియా త‌న రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 175 ర‌న్స్ చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో..రెండు టీంల కెప్టెన్ల ఆంగీకారంతో మ్యాచ్‎ను తొందరగానే అంపైర్లు ముగించారు. ఆసీస్ బ్యాటింగ్ లో ట్రావీస్ హెడ్ 90 ప‌రుగుల‌కు ఔట్ కాగా, స్మిత్ 10, లంబు 63ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు

మొత్తం నాలుగు టెస్ట్‎ల సిరీస్‎లో భాగంగా మొదటి రెండు టెస్ట్‌లను టీం ఇండియా కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ కంగారులు పట్టేశారు. మూడు టెస్ట్‌లకు భిన్నంగా చివరి టెస్ట్ సాగింది. స్పిన్ పిచ్‌లపై పరుగులు చేసేందుకు అష్టకష్టాలు పడి బ్యాటర్లు బ్యాటింగ్‌ కు అనుకూలించిన పిచ్‎పై మాత్రం చెలరేగి ఆడారు.

మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 స్కోరు చేసింది. ఖవాజా (180), గ్రీన్ సెంచరీలతో చెలగరేగడంతో భారీ స్కోర్ సాధించింది.బారత్ బౌలరల్లో అశ్విన్ 6, షమీ 2,జడేజా, అక్షర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్‌కు ధీటుగా బదులిచ్చింది. 571 పరుగులు చేసి ఆసీస్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కోహ్లీ 186, గిల్ 128 అద్భుతమైన శతకాలు అందుకోగా, అక్షర్ 79, శ్రీకర్ భరత్ 44, పుజారా 42 పరుగులతో రాణించారు. లియాన్, ముర్ఫీ మూడేసి వికెట్లు తీయగా, స్టార్క్, కుహెమెన్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 175 పరుగుల వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది.. అనంతరం అంపైర్లు ఇరువురి కెప్టెన్లతో చర్చించి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఈ టెస్ట్ డ్రాగా ముగిసినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు భారత్ దూసుకెళ్లింది. శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ కు లైన్ క్లియర్ అయ్యింది.