ఆస్ట్రేలియాతో జరగుతున్న టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. 321/7 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే రవీంద్ర జడేజా(70) వికెట్‌ను కోల్పోయినా.. తర్వాత వచ్చిన షమీ(47 బంతుల్లో 37 ) తో కలిసి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. దూకుడుగా ఆడే క్రమంలో షమీ ఔటవ్వగా, తర్వాత 84 పరుగులు చేసిన అక్షర్ కూడా పెవిలియన్‌కు చేరడంతో 400 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 7 వికెట్లు, కమ్మిన్స్ 2, లియాన్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ కేవలం 177 పరుగులకే కుదేలైంది. స్పిన్ పిచ్‌పై ఆడలేక ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.అయితే భారత్ ఆటగాళ్లు మాత్రం అదే పిచ్ పై రాణించి మ్యాచ్ పై పట్టు సాధించారు. రోహిత్(212 బంతుల్లో 120) సెంచరీకి, అక్షర్, జడేజా అర్థసెంచరీలు భారీ ఆధిక్యం సంపాదించడానికి దోహదపడ్డాయి. చివరిలో షమీ విలువైన పరుగులు చేశాడు.