బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మిర్పూర్లో జరిగిన రెండో టెస్ట్‌లో 3 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి చేధించింది. నాలుగో రోజు విజయానికి 100 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. 56 పరుగుల వద్ద ఉనద్కత్ (13), 71 పరుగుల వద్ద రిషభ్ పంత్ (9), 74 పరుగుల వద్ద అక్షర్ పటేల్ (34)ను కోల్పోయింది. దీంతో ఇక భారత్ పనైపోయిందని అభిమానులు ఉసూరుమన్నారు.
అయితే, క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ తొలుత నెమ్మదిగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను అశ్విన్, శ్రేయస్ అయ్యర్ గట్టెక్కించారు. మరో వికెట్ పడకుండా విజయ తీరాలకు చేర్చారు. అశ్విన్ 42, అయ్యర్ 29 పరుగులతో అజేయంగా నిలిచారు. పట్టుదలగా ఆడి.. జట్టును గెలిపించారు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసి… 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 145 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.