నేడే భారత్-బంగ్లా చివరి టీ20..నిర్ణయాత్మక మ్యాచ్ - MicTv.in - Telugu News
mictv telugu

నేడే భారత్-బంగ్లా చివరి టీ20..నిర్ణయాత్మక మ్యాచ్

November 10, 2019

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ ఈరోజుతో ముగియనుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిసాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాయి. ఈరోజు నాగ్‌పూర్ వేదికగా రాత్రి 7 గంటలకి జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకూ టీమిండియాపై ఒక్కసారి కూడా బంగ్లాదేశ్ టీ20 సిరీస్ గెలవలేదు. దీంతో ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది రికార్డు సృష్టించాలని బంగ్లా జట్టు ఉవ్విల్లూరుతోంది.

India vs Bangladesh, 3rd T20I..

టీమిండియా జట్టు ఈరోజు మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. టీమిండియా ఓపెనర్,కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా ఆడలేకపోతున్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా సిరీస్‌లో గెలిపించే ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. ఈ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. బౌలింగ్‌ విషయానికి వస్తే చాహల్, దీపక్ చాహర్ మాత్రమే రాణిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గత రెండు టీ20ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అతనిపై వేటు వేసి అతడి స్థానంలోకి శార్ధూల్ ఠాకూర్‌‌ని జట్టులోకి తీసుకుతుంటారని సమాచారం. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతని స్థానంలో సంజు శాంసన్‌ టీమ్‌లోకి వచ్చే అవకాశముంది.