india vs bangladesh first odi update
mictv telugu

ఆచితూచిఆడుతున్న భారత్..కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ

December 4, 2022

బంగ్లాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఆచితూచి ఆడుతుంది. కష్టాల్లో ఉన్న భారత్ కేఎల్ రాహుల్ అర్థసెంచరీతో ఆదుకున్నాడు. ప్రస్తుతం 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీంఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్(7), రోహిత్ శర్మ(27), కోహ్లీ(9) త్వరగానే పెవిలియన్‌కు చేరారు. తర్వాత భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (24), కేఎల్ రాహుల్ కాసేపు ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించారు. అనంతరం అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కేఎల్ రాహుల్‌ (53)తో పాటు వాషింగ్టన్ సుందర్(19 పరుగులు) ఉన్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ అసన్ రెండు వికెట్లు, మెహదీ హసన్, ఎబాదత్ హోస్సేన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.