తొలిటెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా - MicTv.in - Telugu News
mictv telugu

తొలిటెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

November 14, 2019

భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిటెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ దక్కించుకునేందుకు రెండు జట్లు కుతూహలంగా ఉన్నాయి. ఇప్పటికే వరుస సిరీస్‌లను కైవసం చేసుకున్న టీం ఇండియా టెస్ట్ సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని చూస్తోంది. 

India vs Bangladesh Indore.

ఇన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్న టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టతరంగా ఉంటుందని బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకున్నట్టుగా తెలిపింది.  కాగా పిచ్‌ తొలి రోజు సీమర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు పేసర్లను తీసుకోవడం విశేషం.