టీ20 మ్యాచ్.. రోహిత్ శర్మ ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

టీ20 మ్యాచ్.. రోహిత్ శర్మ ఔట్

November 3, 2019

ఢిల్లీ కాలుష్యం కారణంగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో భారత్×బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు తొలి పోరుకు రంగం సిద్ధమై భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరు కారణంగా రోహిత్ శర్మ సారథిగా ఉన్నాడు. అయితే ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ ప్రారంభం అయిన ఆటలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌శర్మ (9) తొలి ఓవర్‌ ఆఖరి బంతికి ఔట్ అయ్యాడు. బంగ్లా బౌలర్లలో షఫియుల్ ఇస్లామ్ 1, అమినుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు. ప్రసుత్తం భారత్ స్కోరు 11 ఓవర్లలో 3 వికెట్లకు 73 పరుగులు నమోదు అయింది

India vs Bangladesh ..

క్రీజులో ధావన్‌ (4), కేఎల్‌ రాహుల్ (6) ఉన్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. 3.1 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా 19/1 స్కోర్ చేసింది. కాగా, భారత జట్టులో రోహిత్‌ శర్మ (సారథి) , శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, కృనాల్‌ పాండ్య, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఉన్నారు.

బంగ్లా జట్టులో లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీమ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మదుల్లా (సారథి), అఫిఫ్‌ హుస్సేన్‌, మొసాదక్‌ హుస్సేన్‌, అమినుల్‌ ఇస్లాం, షఫీయుల్‌ ఇస్లామ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, అల్‌ అమిన్‌ హుస్సేన్‌ ఆడుతున్నారు.