భారత్-బంగ్లా డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌కి అమిత్ షా - MicTv.in - Telugu News
mictv telugu

భారత్-బంగ్లా డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌కి అమిత్ షా

November 15, 2019

భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనున్న చారిత్రక మొదటి డే/నైట్ టెస్టు మ్యాచ్ వీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్‌ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇండియాలో మొదటిసారి డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్ ఆడనుండంతో ఈ మ్యాచ్‌కి ప్రాధాన్యం సంతరించుకుంది. 

India vs Bangladesh.

ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే చారిత్రక ఘట్టాన్ని మరింత అపురూపంగా మలచడానికి క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలను కూడా ఆహ్వానించారు. వారు కూడా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరిద్దరూ గంట మోగించి డే/నైట్ టెస్టు మ్యాచ్‌ని ప్రారంభిస్తారు. బెంగాల్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్‌ షాను ఆహ్వానించగా దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. దీంతో మొదటి డే/టెస్ట్‌ మ్యాచ్‌కి అమిత్ షా హాజరవుతారని క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధికారులు తెలిపారు. దీంతో స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.