India vs England Live Streaming, T20 World Cup 2022 Semi-Final:
mictv telugu

నేడే భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య కీలక మ్యాచ్

November 10, 2022

టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌లో భాగంగా నేడు టీమిండియా.. ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్‌-12లో..అద్భుత ప్రతిభ కనబర్చిన భారత్‌ జట్టు.. ఫైనల్‌లో పాక్‌ను చిత్తుగా ఓడించేందుకు గురువారం బ్రిటీష్‌ జట్టుతో తలపడనుంది. ఇక ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అడిలైడ్‌ ఓవల్‌ వేదిక కానుంది. 15 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్‌ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లలో టీమిండియా అదరగొట్టింది.

ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌కు అత్యంత అనుకూల మైదానం అడిలైడే. ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌-12 మ్యాచ్‌లో భారత్‌ 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెమీస్‌ పిచ్‌ కూడా బ్యాటర్లకే ఎక్కువ అనుకూలం. కానీ ఏకపక్షంగా ఉండదు. పేసర్లకూ అవకాశముంటుంది. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.
తుది జట్లు (అంచనా)…
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌/అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌;
ఇంగ్లాండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), హేల్స్‌, స్టోక్స్‌, మలన్‌/సాల్ట్‌, బ్రూక్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కరన్‌, వోక్స్‌, వుడ్‌/జోర్డాన్‌, రషీద్‌