India vs New Zealand 1st ODI Match Today at Uppal Stadium, Hyderabad.
mictv telugu

ఉప్పల్ వేదికగా కివీస్‌తో టీమిండియా తొలి వన్డే నేడు

January 18, 2023

India vs New Zealand 1st ODI Match Today at Uppal Stadium, Hyderabad.

శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య తొలివన్డే హైదరాబాద్‌ వేదికగా జరగనుంది. సొంతగడ్డపై కివీస్‌ను కూడా చిత్తు చేయాలని భారత జట్టు కోరుకుంటోంది. ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నాం1:30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో పలు మార్పులతో బరిలోకి దిగబోతున్నాయి ఇరు జట్లు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక రెండు రోజుల విరామం అనంతరం మరో పోరుకు సిద్ధమైంది టీమిండియా.

ఈ మ్యాచ్ లో ఆడనున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు సొంతగడ్డపై ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. లంకపై మూడో వన్డేలో భారీ శతకంతో చెలరేగిన విరాట్‌ కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌లో మరోసారి విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వెన్నెముక గాయంతో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయనున్నట్లు సమాచారం. పెళ్లి కారణంగా కేఎల్‌ రాహుల్‌, వ్యక్తిగత పనులతో అక్షర్ పటేల్‌ టీమ్‌కి దూరమయ్యారు. ఈ ఇద్దరి ప్లేస్‌లో ఎవరెవర్ని రిప్లేస్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక న్యూజిలాండ్ కూడా తక్కువేం కాదు. పాకిస్తాన్‌పై వన్డే సిరీస్‌ గెలిచి ఆ టీమ్ కూడా జోరుమీదుంది. బ్యాటింగ్‌ గ్రేట్‌ కేన్‌ విలియమ్సన్‌తో పాటు టిమ్‌ సౌథీ ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోయినా తక్కువ అంచనా వేయకూడదు. లాథమ్‌ కివీస్‌ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ వంటి ఆటగాళ్లపై న్యూజిలాండ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. లంకతో ఆడిన చివరి మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయంతో విజృంభించిన రోహిత్‌ సేన.. కివీస్‌పై అదే ఊపు కొనసాగిస్తుందా చూడాలి.

Suggested: పది పాసైతే చాలు…నెలకు రూ.58,650జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..!

భారత జట్టు అంచనా:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.

న్యూజిలాండ్ జట్టు అంచనా:

టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.

ALSO READ: ‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్‎న్యూస్..!

తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్‌ కొడుకుపై ఆర్జీవీ కామెంట్స్‌