న్యూజిల్యాండ్ తో మొదటి ఆటకు ఇండియా జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ సతీ సమేతంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలిశాడు. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది టీ 20 క్రికెట్ లో నంబర్ 1 ర్యాంక్ కి ఎగబాకి, ఇప్పుడు సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ శాసిస్తున్నాడు. ముంబై ఇండియన్ బ్యాటర్ ఓడీఐ జట్టులోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఉండవచ్చు. అయితే అతను బుధవారం (జనవరి 18) న్యూజిల్యాండ్ తో మొదటి ఆటకు ముందు మిగిలిన ఓడీఐ జట్టుతో హైదరాబాద్ చేరుకున్నాడు.
హైదరాబాద్ పర్యటనలో.. సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా శెట్టి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసే అవకాశం దక్కింది. ఈ సంవత్సరం ఎస్ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్లు. ‘నిన్ను కలువడం చాలా ఆనందంగా ఉంది సోదరా! ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నందుకు నీకు అభినందనలు’ అని జూనియర్ ఎన్టీఆర్, భార్య దేవీషాతో కలిసి దిగిన ఫోటోకి సూర్యకుమార్ యాదవ్ క్యాప్షన్ రాశారు.
రాబోయే 2023 ఐసీసీ ఓడీఐ ప్రపంచకప్ లో సూర్యకుమార్ యాదవ్ ఆతిథ్య భారతదేశానికి ఎక్స్ కారకంగా ఉంటాడని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. 32 యేండ్ల సూర్యకుమార్ సంచలన ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల రాజ్ కోట్ లో శ్రీలంకతో జరిగిన సిరీస్ తన మూడవ టీ 20 సెంచరీని కొట్టాడు. బుధవారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టామ్ లాథమ్ నేతృత్వంలో న్యూజిల్యాండ్ తో టీమీండియా మూడు వన్డేల సిరీస్ ను ప్రారంభించనుంది.
జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ లో అనేక ఇంటర్వ్యూల్లో కనిపించాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా అతను మార్కెల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ యూఎస్ లో మార్వెల్ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ విక్టోరియా అలోన్సోని కలవడంతో ఆయన వారి సినిమాల్లో భాగం అవుతారనే టాక్ వినబడుతుంది. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ హాలీవుడ్ లో కనిపిస్తాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.