నిర్ణయాత్మక మ్యాచ్: టాస్ గెలిచిన టీమ్ ఇండియా - MicTv.in - Telugu News
mictv telugu

నిర్ణయాత్మక మ్యాచ్: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

February 8, 2020

హామిల్టన్ వేదికగా గత బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో గెలవడం టీమిండియాకు తప్పనిసరి అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల ఈ సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. 

ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతి నిచ్చారు. అతని స్థానంలో నవదీప్ సైనీని తీసుకున్నాడు. తొలి వన్డేలో ఎక్కువ పరుగులిచ్చేసిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ స్థానంలో చాహల్‌కి తుది జట్టులోకి వచ్చాడు. కివీస్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. న్యూజిలాండ్‌లోనే అత్యంత పొడవైన క్రికెటర్‌గా పేరొందిన 6.8 అడుగుల ఫాస్ట్ బౌలర్ జెమీసన్‌కి ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. అలానే మిచెల్ శాంట్నర్‌కి బదులుగా మార్క్ చాప్‌మాన్ టీమ్‌లోకి వచ్చాడు.

టీం ఇండియా : 

మయాంక్‌, పృథ్వీ షా, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, మనీశ్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌, నవదీప్‌ సైని, బుమ్రా 

న్యూజిలాండ్ : 

గప్తిల్‌, నికోల్స్‌, బ్లండెల్‌, టేలర్‌, లేథమ్‌, గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌, బెనెట్‌, సౌథీ, జేమిసన్‌, మార్క్‌ చాప్‌మన్‌