India vs New Zealand T20: Hardik Pandya-led Team India look to rebuild a young squad
mictv telugu

నేడు న్యూజిలాండ్‌, భారత్‌ తొలి టీ20 మ్యాచ్

November 18, 2022
India vs New Zealand T20: Hardik Pandya-led Team India look to rebuild a young squad
టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి టీ20 ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌నకు మరో రెండేళ్ల సమయం ఉన్నందున ఆల్‌రౌండర్ ఆటగాళ్లను గుర్తించి వారిని 2024 టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే రోహిత్‌ గైర్హాజరీలో జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. తొలి టీ20 వెల్లింగ్టన్‌ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభంకానుంది.

ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతుండటంతో జట్టులో పెనుమార్పులు చేయాల్సిన అవసరముందని మాజీలు అంటున్న నేపథ్యంలో.. యువ ఆటగాళ్ల సత్తాకు ఈ సిరీస్‌ పరీక్ష కానుంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశముంది. శుభమన్ గిల్‌ ఈ సిరీస్‌తో టీ20ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇషాన్‌కు తోడుగా గిల్‌ ఓపెనర్‌గా పంపే అవకాశముంది. మూడో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగొచ్చు. సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌తో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తున్నా.. అందివచ్చిన అవకాశాన్ని వీళ్లు ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది కీలకం కానుంది.

భారత్‌ తుది జట్టు (అంచనా)

ఇషాన్‌ కిషన్‌, శుభమన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య, యుజేంద్ర చాహల్‌,భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.