న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం - MicTv.in - Telugu News
mictv telugu

న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం

February 27, 2020

cng vn

మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాంటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ(46) ధాటిగా ఆడగా తానియా భాటియా(23) ఫర్వాలేదనిపించింది. 

కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో మిగతా బ్యాట్స్‌వుమెన్‌ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఓపెనర్‌ స్మృతి మంధాన(11), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(1), జెమిమా రోడ్రిగ్స్‌(10), దీప్తి శర్మ(8), వేదా కృష్ణమూర్తి(6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖాపాండే(10), రాధా యాదవ్‌(14) నిలవడంతో న్యూజిలాండ్‌ ముందు ఆ మాత్రమైనా స్కోర్‌ ఉంచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ (2), అమెలియా కెర్ర్‌(2), తాహుహు(1), సోఫీ డివైన్‌(1), కాస్పెరిక్‌(1) వికెట్లు తీశారు. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో టీమిండియా జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.