India vs Pakistan, T20 World Cup 2022: Pakistan set a 160-run target for India
mictv telugu

భారత్ టార్గెట్ @160

October 23, 2022

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 160 పరుగుల టార్గెట్‌ని ఉంచింది. భారత్ తరపున హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, భువీ ఖాతాల్లో ఓ వికెట్‌ చేరింది. పాండ్యా 14వ ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కష్టాల్లో పడేశాడు. పాకిస్థాన్ తరపున ఇఫ్తికర్ 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్సర్లు కూడా కొట్టాడు. షాన్ మసూద్ 52 పరుగులతో నాటౌ‌ట్‌గా నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. ఒక పరుగుకే.. 1.1 ఓవర్లో ఓపెనర్ బాబర్ అజామ్(0)ను పెవిలియన్ పంపించింది. టీమ్ ఇండియా. వెంటనే నాలుగో ఓవర్లో 15 పరుగుల వద్ద మరో కీలక బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(4) అర్షదీప్ సింగ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన షాన్ మసూద్ (52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (51) రాణించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2), మహమ్మద్ నవాజ్ (9), ఆసిఫ్ అలీ (2) ఎవరూ రాణించలేదు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ (8 బంతుల్లో 16), హారిస్ రవూఫ్ (4 బంతుల్లో 6 నాటౌట్) బౌండరీలు బాదారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ చెరో వికెట్ తీసుకున్నారు.