India vs Pakistan T20 World Cup: india scored 45 runs in first 10 overs'
mictv telugu

IND vs Pak T20: 10 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఇది..

October 23, 2022

పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. పాక్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తుండటంతో భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆరంభంలోనే రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ (15), అక్షర్ పటేల్ (2) వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కోహ్లీ, హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా నిదానంగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లను కోల్పోయి కేవలం 45 పరుగులే చేసింది భారత్. క్రీజ్‌లో హార్దిక్‌ పాండ్య (7*), విరాట్ కోహ్లీ (12*) ఉన్నారు. టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 60 బంతుల్లో 115 పరుగులు చేయాలి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో మసూద్ (52*), ఇఫ్తికార్ అహ్మద్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య 3, అర్ష్‌దీప్‌ సింగ్ 3.. షమీ, భువీ చెరో వికెట్‌ తీశారు.