టీ-20 మ్యాచ్‌లో వెనుదిరిగిన ఇండియా.. - MicTv.in - Telugu News
mictv telugu

టీ-20 మ్యాచ్‌లో వెనుదిరిగిన ఇండియా..

September 22, 2019

చిన్నస్వామి స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ-20 మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులు చేశాడు. మిగతా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేకపోయారు. దీంతో భారత్ స్వల్ప స్కోరుకే పరితమయింది. 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఇండియా 134/9తో నిలిచింది. ప్రొటీస్ బౌలింగ్‌ను తట్టుకోలేక స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. 

India vs South Africa.

ధావన్ తరువాత రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 19 పరుగులు చేసి అత్యధిక స్కోరు నమోదు చేశారు. రెండో మ్యాచ్‌లో కోహ్లి తక్కువ స్కోరుకే వెనుదిరగాడు. దీంతో ఇండియా వెనుదిరగక తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లు, ఫార్చ్యూన్, హెండ్రిక్స్ ఒక్కో వికెట్ తీసి వారి జట్టు స్కోరు పెంచారు.