స‌ఫారీల‌పై టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్‌ - MicTv.in - Telugu News
mictv telugu

స‌ఫారీల‌పై టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్‌

October 22, 2019

ద‌క్షిణాఫ్రికాతో రాంచీలో జ‌రిగిన మూడవ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకు కావాల్సిన రెండు వికెట్ల‌ను.. కొత్త బౌల‌ర్ న‌దీమ్ అట నాలుగోరోజైన ఈరోజు త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

సౌతాఫ్రికా త‌న రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 162 ప‌రుగుల‌కు ఆలౌటై ఫాలోఆన్‌లో కూడా విఫలమైంది. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 497 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో సిరీస్ క్వీన్‌స్వీప్ కావ‌డంతో టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో భార‌త్ ముందు వ‌రుస‌లో నిలిచింది.