162 పరుగులకే ఆల్ అవుట్..ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు - MicTv.in - Telugu News
mictv telugu

162 పరుగులకే ఆల్ అవుట్..ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు

October 21, 2019

India VS south africa, live cricket score

రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిస్తోంది. టీంఇండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ 162 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఎల్గర్‌ (0) , డికాక్‌ (4),  డుప్లెసిస్ ( 1) ఔటైన తరువాత హంజా (62) కొద్దిసేపు ఒంటరి పోరాటం చేశాడు. హంజా అవుట్ అయిన తరువాత బవుమా(32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (37), నోర్ట్ జె (4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు. దీంతో సౌతాఫ్రికా 162 పరుగులకు ఆలౌట్ అయింది. 

టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కి మూడు వికెట్లు, షమీ, జడేజా, నదీమ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 497 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఆటగాళ్లను ఫాలో ఆన్ ఆడించాలని టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయించాడు. ఫాలో ఆన్ ఆడడానికి వచ్చిన సౌతాఫ్రికా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డికాక్(5), హంజా (0), డు ప్లెసిస్ (4) తక్కువ పరుగులకే ఔటయ్యారు. రెండవ ఇన్నింగ్స్ లో షమీ రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక విక్కెట్ తీశారు. రెండవ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 8 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఎల్గార్ (12), బావుమా (0) క్రీజ్‌లో ఉన్నారు.