లంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే - MicTv.in - Telugu News
mictv telugu

లంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే

January 11, 2020

hfnv

శ్రీలంక, భారత్ మధ్య జరిగిన టీ 20 సిరీస్‌ను టీం ఇండియా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ విక్టరీ కొట్టింది. పుణేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 78 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. దీంతో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలో లంక ఆటగాళ్లు 15.5 ఓవర్లలోనే అలౌట్ అయ్యారు. 

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన లంక ఆటగాళ్లు మొదటి నుంచే తడబడుతూ వచ్చారు. దీంతో 15.5 ఓవర్లలకు123 పరుగులు మాత్రమే చేసి అలౌట్ అయింది. ధనంజయ డిసిల్వా (57), ఏంజెలో మాథ్యూస్ (31) మినహా మరెవ్వరూ రాణించలేదు. దీంతో సొంత గడ్డపై మరోసారి భారత్ తన సత్తా చాటుకుంది.  శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్‌ భారత్‌కు శుభారంభాన్ని అందించారు. దీంతో మంచి స్కోర్ దిశగా టీం ఇండియా వెళ్లింది.