భువి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

భువి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌..వీడియో

August 12, 2019

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ 35వ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా భువనేశ్వర్ బౌలింగ్‌ వేసాడు. గుడ్‌ లెంగ్త్‌లో పడిన ఐదో బాల్‌ని ఛేజ్‌.. బౌలర్ పక్కనుంచి ఆడబోయి క్యాచ్‌లో దొరికిపోయాడు. బంతి తనవైపు వస్తున్న విషయం గమనించిన భువి వెంటనే స్పందించి ఎడమ వైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో బంతి అందుకున్నాడు. దీంతో ఛేజ్‌ 18 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసిన భువనేశ్వర్‌ 31 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించింది.