టీమిండియా వర్సెస్ వెస్టిండీస్‌..నేడే సిరీస్ పోరు - MicTv.in - Telugu News
mictv telugu

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్‌..నేడే సిరీస్ పోరు

December 11, 2019

India vs West Indies02

మూడు టీ20ల సిరీస్‌లో భారత్, వెస్టిండీస్‌ జట్లు మధ్య ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఖరి మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గత మ్యాచ్‌ విజయంతో విండీస్‌ జోష్‌లో ఉండగా.. ఫీల్డింగ్‌, బౌలింగ్ సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా ఒత్తిడిలో ఉంది. వాంఖడే వికెట్‌ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చేసింగ్ చాలా సులువు. టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. మంచుకురిసే రాత్రి వేళ బౌలర్లకు పట్టుదొరకడం కష్టం కావొచ్చు. పేస్‌తో పాటు చక్కటి బౌన్స్‌తో పేసర్లు రాణించవచ్చు. ఏవిధంగా బ్యాట్స్‌మెన్‌కు ఈ పిచ్ అనుకూలం. వాతావరణం చల్లగా ఉండనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా):

టీమిండియా: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చహల్.

వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), సిమన్స్‌, లూయిస్‌, కింగ్‌, హెట్‌మైర్‌, పూరన్‌, హోల్డర్‌, పియర్‌, కెస్రిక్‌, కాట్రెల్‌, వాల్ష్‌.