వాహ్.. రోహిత్ మెరిపిస్తే.. అంబటి అదుర్స్..

విండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ దుమ్మురేపింది.. బౌలర్లు బంతిని ఎటు వేసినా.. బౌండరీకి బాదారు.  రోహిత్ శర్మ, అంబటిరాయుడు సెంచరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరూ బంతిని వీర బాదుడు బాదుతూ.. విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.India vs West Indies, 4th One Day.. Rohit Sharma, Ambati Rayudu Tons Power India To 377/571 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (38) వెనుదిరగడంతో.. కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే అభిమానులు కోహ్లీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ 16 పరుగులకే అవుటవడంతో ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ తర్వాత అంబటి రాయుడు, రోహిత్ శర్మ జతకట్టి స్కోరు బోర్డును ఊరుకులు పెట్టించారు. రోహిత్ 98 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో సెంచరీ చేశాడు.. మెరుపులు మెరిపిస్తూ రోహిత్ అదే జోరును కొనసాగిస్తూ.. డబుల్ సెంచరీ దిశగా పరుగెత్తాడు..

కానీ 162 పరుగుల వద్ద బౌలర్ నర్స్ వేసిన బంతికి రోహిత్ హేమ్ రాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే అప్పటికే అర్థశతకం సాధించిన అంబటి రాయుడు 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు.. ఆ వెంటనే రనౌట్ అయ్యాడు. ధోనీ 23, కేదార్ జాదవ్ 16(నాటౌట్), రవీంద్ర జడేజా 7(నాటౌట్) రాణించారు. విండీస్ బౌలర్లలో రోజ్ రెండు, ఆశ్లే నర్స్, కీమో పాల్ తలో ఒక వికెట్ పడగొట్టారు. కాగా విండీస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.