టీ20 సిరీస్‌కు శిఖర్ ధావన్ దూరం.. - MicTv.in - Telugu News
mictv telugu

టీ20 సిరీస్‌కు శిఖర్ ధావన్ దూరం..

November 27, 2019

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ డిసెంబర్ 6నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న ధావన్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్‌కు అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 మ్యాచ్‌లో ఢిల్లీ తరపున శిఖర్ ధావన్ ఆడాడు. ఈ సందర్భంగా డైవింగ్ చేసినప్పుడు ధావన్ ఎడమ మోకాలికి గాయం తగిలింది. అతనికి కొంత కాలం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ధావన్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా, డిసెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ధావన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సంజు శాంసన్ (వికెట్ కీపర్).