ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్సులో భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కి ఒక పరుగు ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్సులో ఆ జట్టు 263 పరుగులు చేసింది. అంతకుముందు 21/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. నాథన్ లైయన్ దెబ్బకు వరుసగా వికెట్లను కోల్పోయింది.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్‌లను నాథన్ ఒక్కడే ఔట్ చేశాడు. ఇక వందో టెస్టు ఆడుతున్న పుజారా వరుసగా రెండు సార్లు డకౌట్ అయ్యాడు. అయితే మొదటి ఔట్‌కి ప్రత్యర్ధి రివ్యూ కోరకపోవడంతో బతికిపోయిన పుజారా.. తర్వాత 7 బంతుల వ్యవధిలో మరోసారి చిక్కి తప్పించుకోలేకపోయాడు. రన్నింగ్ మెషీన్ కోహ్లీ 44 పరుగుల వద్ద ఔట్ కాగా, ఇది వివాదాస్పదమైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (37), అక్షర్ పటేల్(74)లు స్కోరుబోర్డును 200 పరుగులు దాటించారు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతూ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఐదు వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5 వేల కంటే ఎక్కువ పరుగులు, 700 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఐదవ భారత బౌలర్‌గా నిలిచాడు. అటు నాథన్ కూడా అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. టీమిండియాపై వంద వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.