దేశమంతా లాక్‌డౌన్.. అందుబాటులో ఉండే సేవలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

దేశమంతా లాక్‌డౌన్.. అందుబాటులో ఉండే సేవలు ఇవే

March 25, 2020

India

కరోనా ప్రపంచం అంతటా కల్లోలం సృష్టిస్తోంది. దీని దాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. చాలా మంది బాధితులు ఆస్పతుల్లో ఉండగా.. ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. భారత్‌లో ఈ మహమ్మారిని నిలువరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంభిస్తున్నాయి. ఇప్పటి వరకూ మార్చి 31 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించిన ప్రధాని మోదీ, ఆ గడువు మరింత పొడగించారు. ఏప్రిల్ 14 వరకూ దేశమంతా లాక్‌డౌన్ అమలు చేస్తామన్నారు. ఇళ్లు దాటి ఏ ఒక్కరు కూడా బయటకు రాకూడదని కోరారు. తాను గీసే లక్ష్మణ రేఖను దాటకూడదని సూచించారు.

దేశంలో ప్రతీ నగరం, ప్రతీ ఊరు, ప్రతీ వీధి లాక్ డౌన్ అవుతుందన్నారు. ప్రధాని తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా చాలా సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఇంతకీ ఏఏ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయో..? ఏవి ఉండవు.? అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ప్రజా అవసరాల దృష్ట్యా కొన్ని మినహాయింపులు మాత్రం ఇచ్చారు. అవేంటో ఈ కింద చూడండి. 

లాక్ డౌన్‌లో తెరిచి ఉంచేవి ఇవే :

  1. నిత్యావసరాలు, పాలు, కూరగాయలు,మాంస విక్రయ కేంద్రాలు
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు
  3. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు 
  4. పెట్రోల్,ఎల్పీజీ గ్యాస్ సంస్థలు
  5. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 
  6. ఆస్పత్రులు, మెడికల్ షాపులు
  7. ఈ కామర్స్ ద్వారా ఫుడ్, మెడికల్ వస్తువులు డెలివరీ చేసే సంస్థలు 
  8. ఎవరికైనా  మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే 104,100 సేవలను వినియోగించుకోవచ్చు.