కలిపి కొట్టారు.. టీ20 సిరీస్ కైవసం..  - MicTv.in - Telugu News
mictv telugu

కలిపి కొట్టారు.. టీ20 సిరీస్ కైవసం.. 

December 11, 2019

India wins t20

భారత ఆటగాళ్ల దాడికి వెస్టిండీస్ విలవిల్లాడింది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో కోహ్లీ సేన చెలరేగి ఆడింది. ఈ రోజు కరీబియ్ జట్టుతో జరిగిన మూడో కీలక టీ20లో మనోళ్లు కలసికట్టుగా ఆడి సిరీస్‌ను కైవశం చేసుకున్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు పోగొట్గటుకుని 240 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. రోహిత్‌శర్మ(71; 34 బంతుల్లో 6×4, 5×6), కేఎల్‌ రాహుల్‌(91; 56 బంతుల్లో 9×4, 4×6), విరాట్‌ కోహ్లీ(70; 29 బంతుల్లో 4×4, 7×6)  బాదేశారు. 

తర్వత బ్యాటింగ్ చేసిన విండీస్‌ మొదట్లోనే చతికిలబడింది. మూడు వికెట్లు కోల్పోయాక బ్యాట్ పట్టుకున్న హెట్మెయిర్‌ 41 పరుగులు చేశాడు.  పొలార్డ్‌ కూడా సత్తా చాటి (68) చాటాడు అయినా భారీ లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకుగాను 173 పరుగుల వద్ద చేతెలెత్తేసింది. భార్ 67 పరుగులతో మీసం తిప్పింది.