భారత మహిళా కెప్టెన్ ను ఘనంగా సత్కరించిన కేసీఆర్..! - MicTv.in - Telugu News
mictv telugu

భారత మహిళా కెప్టెన్ ను ఘనంగా సత్కరించిన కేసీఆర్..!

July 28, 2017

మహిళ ప్రపంచ కప్ ఫైనల్ లో గెలవలేకపోయినా దేశంలో ఉన్న అందరి మనసులు గెల్చుకున్నారు  భారత మహిళా క్రికెట్ జట్టు,కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రపంచ కప్ గెలవలేకపోయినా మెరుగైన ప్రదర్శన ఇచ్చినందుకు  సియం కేసీఆర్ మహిళా టీమ్ ను అభినందించారు,మిథాలీ రాజ్ ఈరోజు సియం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసారు,కేసీఆర్ భారత మహిళా టీంకు అభినందనలు తెలిపి మిథాలీరాజ్ ను ఘనంగా సత్కరించారు.

మీ ఆట చాలా బాగా ఆడారు,నేను కూడా మ్యాచ్ చూసాను,దృర దుష్టవశాత్తు ఫైనల్ గెలవలేకపోయాం..కానీ మీ ఆట తీరును నాతో పాటు దేశ ప్రజలందరికి  ఎంతో సంతోషాన్ని కలిగించింది. అని కేసీఆర్ మిథాలీ రాజ్ తో అన్నారు.అంతే కాదు మిథాలీ రాజ్ కు కోటి రూపాయలతో పాటు  బంజారా హిల్స్ లో 600 గజాల స్ధలాన్ని కూడా ప్రకటించారు. అలాగే  కోచ్ కు 25 లక్షల రూపాయలను  ప్రకటించారు కేసీఆర్.