India women win Hockey Bronze, Nitu Ghangas wins Boxing Gold
mictv telugu

జయహో భారత్: బాక్సింగ్‌లో రెండు గోల్డ్ మెడల్స్.. ఫైనల్‌కు సింధు..

August 7, 2022

కామెన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. బాక్సింగ్‌లో నీతూకు, అమిత్ పంఘల్‌కు గోల్డ్ మెడల్ వరించింది. అమిత్ పంఘల్ 48-51కేజీల విభాగంలో ఇంగ్లాండ్‌కు చెందిన కియారన్ 5-0తేడాతో ఓడించి ఈ మెడల్‌ను దక్కించుకున్నాడు.

మరోవైపు పీవీ సింధు పతకం ఖాయమైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సెమీ ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన జియా మిన్‌ను ఓడించింది. తొలి గేమ్‌లో సింగపూర్‌ క్రీడాకారిణి నుంచి భారత స్టార్‌కి గట్టి సవాలు ఎదురైనప్పటికీ, సింధు తన అనుభవాన్ని చక్కగా ఉపయోగించి తొలి గేమ్‌ను 21-19తో, రెండో గేమ్‌ను 21-17తో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ఇక ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత మహిళల జట్టు అద్భతాన్ని చేసి చూపించింది. కెప్టెన్ సవితా పునియా అద్భుత గోల్ కీపింగ్ కారణంగా భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. మ్యాచ్‌ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు న్యూజిలాండ్‌ స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌కు దారితీసింది. ఇందులో భారత్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. టీమ్‌ఇండియా 2 గోల్స్‌తో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత అమ్మాయిల హాకీ జట్టును రిఫరీ తప్పిదం దెబ్బ తీసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో 0-3 తేడాతో ఓడింది.