India Women won by 7 wkts
mictv telugu

అదరగొట్టిన అమ్మాయిలు…వరల్డ్ కప్‎లో పాక్‎పై భారత్ గెలుపు

February 12, 2023

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణి కొట్టింది. కేప్ టౌన్ వేదికగా దాయాది దేశం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీంఇండియా ఆటగాళ్లు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించారు. రోడ్రిగస్(38 బంతుల్లో53*)అజేయ అర్థసెంచరీతో అదరగొట్టగా, రిచా ఘోష్(20 బంతుల్లో 31*) మెరుపులు మెరిపించింది. ఓపెనర్ షఫాలీ వర్మ(25 బంతుల్లో 33) అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. పాక్ బౌలర్లలో సంధు 2 వికెట్లు, సదియా ఇక్బాల్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 68, అయేషా నసీమ్ 43 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో రాధాయాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు