కాంగ్రెస్ హయాంలోనే వరల్డ్ కప్స్ గెలిచిన టీమిండియా - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ హయాంలోనే వరల్డ్ కప్స్ గెలిచిన టీమిండియా

July 11, 2019

ప్రపంచ‌ కప్‌లో భాగంగా నిన్న జరిగిన మొదటి సెమీ ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ విఫలమైనప్పటికీ జడేజా, ధోనీ నిలకడగా ఆడి జట్టు విజయావకాశాలను మెరుగుపరిచారు. కానీ, ధోని రన్ అవుట్ కావడంతో భారత్ చేతులెత్తేసింది. అయితే టీంఇండియా ఓటమిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే టీమిండియా ప్రపంచ కప్‌లు గెలిచిందని కమెడియన్ కునాల్ కమ్ర ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. క్రికెట్‌కు రాజకీయాలకు ముడిపెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.

1983లో టీమిండియా మొదటిసారి ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే 28 సంవత్సరాల తరువాత 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రెండు ప్రపంచ కప్‌ల్లో టీంఇండియా ఓటమి ఓటమిపాలయింది.