జయహో భారత్...జయ జయహో భారత్...! - MicTv.in - Telugu News
mictv telugu

జయహో భారత్…జయ జయహో భారత్…!

July 29, 2017

రెండేండ్ల క్రితం గాలేలో తమకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది భార‌త్. 304  ప‌రుగుల తేడాతో శ్రీలంక పై ఘ‌న విజ‌యం సాధించింది. ఒక్క రోజు మిగిలి ఉండగానే టీం ఇండియా ఈ విజ‌యాన్ని అందుకోవ‌డం విశేషం. తొలి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఈ రోజు ఉదయం ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన టీమిండియా నిన్న‌టి స్కోరుకి మ‌రో 50 ప‌రుగులు జ‌త‌ చేసి 240 ప‌రుగుల‌కి డిక్లేర్ చేసింది. దీంతో 550 ప‌రుగుల టార్గెట్ ని శ్రీలంక ముందు ఉంచింది.అయితే ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డి వికెట్స్ కోల్పోయిన శ్రీలంక త‌ర్వాత పుంజుకుంది. ఓపెన‌ర్ కరుణర‌త్నే (97), డిక్ వెల్లా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేశారు. ఇక వీరిద్ద‌రు ఔట్ కావ‌డంతో మిగ‌తా బ్యాట్స్ మెన్ లు పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. చివ‌రి బ్యాట్స్ మెన్స్ హెరాత్, గుణ‌ర‌త్నేలు రిటైర్డ్ హ‌ర్ట్ కావ‌డంతో భార‌త్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. భార‌త్ బౌల‌ర్ల‌లో అశ్విన్ (3), జ‌డేజా (3) వికెట్స్ ద‌క్కించుకోగా ష‌మీ కి ఒక‌టియాద‌వ్ కి ఒక్క విక్కెట్ దక్కింది. శిఖర్ ధావ‌న్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ద‌క్కింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 600 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు న‌ష్టానికి 240 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల న‌ష్టానికి 291 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్ల న‌ష్టానికి 245 ప‌రుగులు చేసింది. మూడు టెస్ట్ ల సిరీస్ లో భార‌త్ 1-0 ఆధిక్యాన్ని సాధించ‌గా , రెండో టెస్ట్ మ్యాచ్ ఆగ‌స్ట్ 3న కొలంబోలో జ‌ర‌గనుంది