బోణీ అదిరింది..విశాఖ వేదికగా టీం ఇండియా విక్టరీ - MicTv.in - Telugu News
mictv telugu

బోణీ అదిరింది..విశాఖ వేదికగా టీం ఇండియా విక్టరీ

October 6, 2019

India Won First Test Match On South Africa

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీం ఇండియా బోణీ కొట్టింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో  203 పరుగుల తేడాతో అద్భతమైన విక్టరీ అందించారు. సొంతగడ్డపై ఏడాదికి పైగా విరామం తర్వాత ఆడిన తొలి టెస్టులో ఘన విజయం సాధించారు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇండియా 1-0గా నిలిచింది. భారత బౌలర్ల తీరు.. బ్యాట్స్‌మెన్ల వీరబాదుడుకు సఫారీలు చతికలపడిపోయి చేతులెత్తేశారు. 

భారత బౌలర్లలో అద్వితీయ ప్రదర్శనతో సఫారీలను కుప్పకూల్చారు. రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే వికెట్లు సమర్పించుకున్నారు. ఆదివారం చివరి రోజు కావడంతో తొమ్మిది వికెట్ల తీయాల్సి ఉండగా ఇండియా బౌలర్లు షమీ, జడేజా రెచ్చిపోయారు. తమ బంతికి పదునుపెట్టి వికెట్లు కూల్చేశారు. షమీ(5/35), జడేజా(4/87)తో సఫారీలను కట్టడి చేశారు. దీంతో  63.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సెనురన్‌ ముత్తస్వామి 49 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. పైట్‌ 56 పరుగులు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు.