India won the first T20 match against West Indies
mictv telugu

తొలి టీ20లో ఇండియా ఘన విజయం.. మరో రికార్డు సాధించిన పంత్

July 30, 2022

వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తర్వాత లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక్కరూ కూడా 30 పరుగులు మార్కును దాటలేకపోయారు. దాంతో భారత్ 68 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచులో 14 పరుగులు చేసిన పంత్.. 12 పరుగుల వద్ద ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. తర్వాతి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. అతను 23 ఇన్నింగ్స్‌లలో 866 పరుగులు చేశాడు. కాగా, రెండో టీ20 సోమవారం జరుగునుంది.