India won the T20 series with New Zealand..3rd t20 tie
mictv telugu

కివీస్‌తో మూడో టీ20 టై..సిరీస్ భారత్ కైవసం

November 22, 2022

India won the T20 series with New Zealand..3rd t20 tie

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ’టై‘గా ముగిసింది. మధ్యలో వర్షం రావడంతో భారత్ 75/4 స్కోరు వద్ద మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్ వర్త్ లూయీస్ ప్రకారం చూడగా ఇరు జట్ల స్కోరు సమం అయ్యింది. దీంతో మ్యాచ్ టై అయినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక సిరీస్‌ను భారత్ 1-0తో దక్కించుకుంది. మొదటి టీ20 వర్షానికి రద్దవ్వగా రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ టైగా ముగిసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధసెంచరీలతో రాణించినా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ఓ దశలో 2 వికెట్లకు 130 పరుగులతో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను సిరాజ్, అర్షదీప్ దెబ్బకొట్టారు. ఇద్దరు నాలుగేసి చొప్పున వికెట్లు తీసి రాణించారు.

న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొందరగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్(10), పంత్ (11) శ్రేయస్ అయ్యర్ (0) తోపాటు లాస్ట్ మ్యాచ్ హీర్ సూర్యకుమార్ యాదవ్(13) కూడా విఫలమయ్యారు. క్రీ‌జ్‌లో హార్దిక్ పాండ్య (30),దీపక్ హుడా(9) పరుగులతో ఉన్న సమయంలో వర్షం కురిసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 2 వికెట్లు తీసుకోగా, సోధి, మిల్నే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరాజ్‌కు దక్కగా, మ్యూన్ ఆఫ్ ద సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు.