శ్రీలంకపై భారత్ భారీ విజయం.. సిరీస్ కైవసం - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకపై భారత్ భారీ విజయం.. సిరీస్ కైవసం

March 14, 2022

 

fghnfgbh

బెంగళూరులో శ్రీలంకతో జరుగుతున్న డే అండ్ నైట్ రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 447 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 208 పరుగులు చేసి ఆలౌటయింది. తద్వారా భారత్ 238 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 3, అశ్విన్ 4 వికెట్లు తీశారు. తాజా విజయంతో టీ ట్వంటీతో పాటు టెస్టు సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేసింది భారత్.