శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 సిరీస్ మూడో మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో తొలి ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ రెండు బంతులాడి ఒక పరుగే చేసి దిల్షాన్ బౌలింగులో డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫైనల్ మ్యాచుకి భారత్ మార్పులేవీ లేకుండానే బరిలోకి దిగగా, శ్రీలంక ఒక మార్పు చేసింది. భానుక రాజపక్స స్థానంలో ఆవిష్క ఫెర్నాండో తుది జట్టులో చోటు సంపాదించాడు. కాగా, రెండో ఓవర్ వేసిన కసున్ రజిత ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పూర్తి మెయిడిన్ వేశాడు.