దేశభక్తికి క్రియేటివిటిని జోడిస్తే ఇలా ఉంటది - MicTv.in - Telugu News
mictv telugu

దేశభక్తికి క్రియేటివిటిని జోడిస్తే ఇలా ఉంటది

June 14, 2017

 

నెటిజన్ల క్రియేటివిటి పీక్స్ కెళ్లింది.అది ఎంతగా అంటే దేశాల నడుమున్న దూరాన్ని క్రికెట్ ద్వారా దగ్గర చేసేంత,ఒకప్పుడు తమ స్ధ్వార్ధంకోసం యుద్దం చేసిన దేశాలు.. ఇప్పుడు ట్రోఫీకోసం యుద్దం చేస్తున్నాయి అని అనుకునేంత. ఇంతకి అసలు విషయం ఏంటంటే…ఇదివర్కు ఒకటిగా కలిసున్న భారత్- పాకిస్ధాన్- బంగ్లాదేశ్ లు ఛాంపియన్స్ ట్రోఫీ పుణ‌్యమా అని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సెమీ ఫైనల్లోకి కలుసుకోగలిగాయి,ఇంకా విచిత్రమేమిటంటే ఈ మూడు దేశాల్ను ముక్కలుగా విడగొట్టిన ఇంగ్లాండ్ కూడా ఇదే సెమీ ఫైనల్లో ఉండడం విశేషం. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చక్కర్లు కొడుతున్న వార్త.ఎక్కడినుంచి ఎక్కడికి లింక్ పెట్టారో చూసారా..నెటిజన్ల మేధాశక్తికి కాళ్లు మొక్కి దండం పెట్టాలన్పిస్తుంది కదా.