india,australia preparations for the Border-Gavaskar Trophy in Nagpur
mictv telugu

టెస్ట్ సిరీస్ కోసం భారత్-ఆసీస్ జట్లు కఠోర సాధన..

February 4, 2023

india,australia preparations for the Border-Gavaskar Trophy in Nagpur

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్ట్ సిరీస్ కోసం భారత్-ఆసీస్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నాగ్‎పూర్ చేరుకున్న ఇరుజట్లు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి. తాజాగా టీమ్ ఇండియా ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న ఫొటోల‌ను బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో విరాట్ కోహ్లి, ఛ‌టేశ్వ‌ర్ పుజారా, రోహిత్ శ‌ర్మ‌తో పాటు ర‌వీంద్ర జ‌డేజాలు మైదానంలో చెమటోడ్చుతున్నారు. నాలుగు మ్యాచ్‌ల ఈ బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఫిబ్ర‌వ‌రి 9న మొద‌లుకానుంది.

డ‌బ్ల్యూటీసీ ఫైనల్‎పై గురి

కొత్త సంవత్సరంలో వరుస సిరీస్‌లు గెలుచుకున్న ఊపుతో ఆసీస్‎తో టెస్ట్ సిరీస్‎కు భారత్ సిద్ధమైంది. అయితే వన్డే, టీ 20 సిరీస్‎లు కైవసం చేసుకున్న భారత్ ఆటగాల్లు టెస్టుల్లో ఎలా ఆడతారన్నది వేచి చూడాలి. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ చేరుకోవాలంటే ఈ సిరీస్‎లో రెండు జట్లు ముందజ వేయాలి. దీంతో ఈ సిరీస్ రసవత్తరంగా సాగనుంది. టీమ్ ఇండియా ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు కావాలంటే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని 3 -0 లేదా అంత‌కంటే ఎక్కువ తేడాతో గెల‌వాలి.

అశ్విన్ డూప్‌తో ప్రాక్టీస్

ఉపఖండ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‎లో ఇబ్బంది పడే ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక సాధన చేస్తున్నారు. ఇందుకోసం ఓ పిచ్ తయారు చేసుకొని దానిపై ప్రాక్టీస్ మొదలు పెట్టారు. మరోవైపు భారత్ స్పిన్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం దృష్టిసారించారు. అందుకోసం ఫ్లైటెడ్ డెలివరీలతో వికెట్లు పడగొట్టే అశ్విన్ వంటి రనప్, శైలీ ఉన్న బరోడ స్పిన్నర్ మహేష్‌‌ను పిలిపించుకొని అతని బౌలింగ్‎లో సాధన చేస్తున్నారు. అశ్విన్‌ను అడ్డుకోవడం కోసం ఆసీస్ బ్యాట‌ర్లు నెట్స్‌లో అశ్విన్ డూప్‌ బౌలింగ్‎ను ఎక్కువగా ఆడుతున్నారు. ఏదేమైనా స్వదేశంలో భారత్ స్పిన్నర్స్‌ను ఎదుర్కోవాలంటే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు కత్తిమీద సామే.