ఒక్క క్లిక్ తో చైనా కిల్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క క్లిక్ తో చైనా కిల్..!

July 19, 2017

యుద్ధం మొదలైంది. అవును చైనాపై యుద్ధం మొదలైంది.గన్ల ట్రిగ్గర్లు నొక్కలేదు. ఫిరాంగులు ఎక్కు పెట్టలేదు. భారత సైనికులు సైలెంట్ గానే ఉన్నారు. గానీ చైనాపై యుద్ధం ఓ రేంజ్ లా కొనసాగుతోంది. ఇలా ఎలా..?

సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతోన్న డ్రాగన్ కు దడ పుడుతోంది. చైనాను దెబ్బ తీసేందుకు ఒకే ఒక్క పనిచేస్తున్నారు భారతీయులు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్ ..ఒకే ఒక్క నిర్ణయంతో కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు.మును ముందు తోకముడిచేలా చేస్తున్నారు. అత్యంత చాకచక్యంగా ఆ దేశ ఆర్థిక వృద్దికి ఎసరు పెడుతున్నారు.

రెచ్చిపోతున్న చైనాను చూసి కసితో రగిలిపోతున్న సగటు భారతీయుడు లోలోపలే ఉడికిపోతున్నాడు. ఎలాగూ సరిహద్దుల్లోకి వెళ్లి సైనికుల్లా పోరాడే అవకాశమూ లేదు. తమ నిర్ణయంతో సరిహద్దులో ఉండే భారత సైన్యంలోనైనా స్థైర్యం నింపులనుకుంటున్నాడు. ఇందులో భాగంగా చైనా వస్తువుల్ని కొందరు కొనడం మానేశారు. మరికొందరు ఆ దేశ మొబైల్స్ ను కొనడానికి ఇష్టపడటం లేదు.ఇంకొందరు ఆన్ లైన్ సైట్లలో చైనా ఉత్పత్తుల్ని ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేస్తున్నారు.

కొన్ని కంపెనీల యజమానులు కూడా డ్రాగన్ పై గరం గరం అవుతున్నారు. ఎలాగైనా దెబ్బకొట్టాలని ఆలోచిస్తున్నారు. తొలుత తమ కుటుంబాల్లో చైనా వస్తువుల్ని వాడటం , కొనడం మానేశారు. ఉద్యోగుల్ని కూడా కొనొద్దని చెబుతున్నారు. గుజరాత్ కు చెందిన రుద్ర ఎంటీఎక్స్ అనే కంపెనీ చైనా ఫోన్లని వాడొద్దని, వాటిని వెనక్కి ఇచ్చేస్తే ఇండియన్ కంపెనీల ఫోన్లు ఇప్పిస్తామని ఆఫర్ ఇచ్చింది. మరికొన్ని కంపెనీలు స్వచ్ఛందంగా చైనా వస్తువల్ని కొనడం మానేశాయి.

మిగతా జనం, కంపెనీలు కూడా ఈ బాటలో నడిస్తే చైనాకు యుద్ధంలో ఒడిపోయినదానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతోంది. ఆ దేశ కంపెనీలు దివాలా తీయడం ఖాయం. ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. సో యుద్ధం చేయకుండానే భారత్ చైనాను ఒడించే పనిలో ఉంది. భారతీయులు అందరూ ఇలాగే ఆలోచించారో.. డ్రాగన్ ఖేల్ ఖతమే.