ప్రపంచమంతా మనవైపే..డ్రాగన్ కు దడ దడ…!
ప్రపంచమంతా భారత్ వైపే…అయినా డ్రాగన్ బుసలు కొడుతుంది. రెచ్చిగొట్టేలా మాట్లాడుతోంది. ఆ దేశ మీడియా రాతల దాడి కొనసాగిస్తోంది. వెనక్కి వెళ్లండి లేదా చచ్చిపోతారు అని చైనా మాజీ రాయబారి రెచ్చగొడుతున్నారు. మూడు ఆప్షన్లు ఇస్తున్నామంటూ కూతలు కూస్తున్నారు. చైనా గొడవలో ప్రపంచమంతా భారత్ వైపు ఉంటే…. డ్రాగన్ మాత్రం ఎందుకు బుసలు కొడుతోంది…?
భారత్ -చైనా సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు అన్ని తప్పుపడుతున్నా…డ్రాగన్ దూకుడు ఆగడు.కయ్యానికి కాలు దువ్వుతూ కవ్వింపులతో రెచ్చగొడుతోంది. డోక్లామ్ లో పాగా వేయాలని చూస్తోంది. చైనా చర్యల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. బుసలు కొడుతున్న డ్రాగన్ కు దడ పుట్టిస్తోంది.
ప్రపంచంలోని దేశాలన్నీ కూడా భారత్‌తోనే ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. సిక్కింలోని డోక్లామ్ వివాదం విషయాన్ని తెలిసి ఆయా దేశాల ప్రతినిధులంతా దిగ్బ్రాంతి చెందారని చైనా విదేశాంగ ప్రతినిధులు చెప్పిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు కారణం లేకుండా భారత్ ఏ విషయాన్ని చెప్పలేదని, ప్రపంచంలోని దేశాలన్నీ కూడా తమకే మద్దతిస్తున్నాయని అన్నారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని విధాల దౌత్యమార్గాలను అనుసరిస్తున్నామని, చైనా మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడుతూ భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని సీరియస్ వాతావరణాన్ని సృష్టిస్తోందని సుష్మా మండిపడ్డారు. మేం మాత్రమే కాదు.. ఇరు దేశాల సైన్యాలను వెనక్కి పిలవాలని కోరుతున్నాం.. ఆ తర్వాత చర్చలకు రావాలంటున్నాం. కానీ, చైనా మాత్రం భారత్ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటేనే చర్చలని చెబుతోంది అని సుష్మా అన్నారు.
"ఇప్పటికే డోక్లామ్ ప్రాంతం భారత్‌లో భాగం అని ఇప్పటికే భూటాన్, భారత్ చెబుతున్నాయి. అలాగే, డాంగ్‌లాంగ్ చైనాది.. అది భూటాన్‌ది కూడా. చైనా, భూటాన్ మధ్య వ్యవహారం అయితే మాకు సంబంధం లేదు.. మేం పట్టించుకోం కూడా అయితే, ఇప్పుడు మూడు దేశాలతో ముడిపడిన వ్యవహారం. దీన్ని తేలిగ్గా వదిలేస్తే రక్షణ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి" అని సుష్మా స్వరాజ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు.