Home > Featured > శ్రీదేవి మళ్ళీ పుట్టింది.. సింగపూర్‌లో అందాల బొమ్మ

శ్రీదేవి మళ్ళీ పుట్టింది.. సింగపూర్‌లో అందాల బొమ్మ

ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి అభిమానుల సందర్శనార్థం ప్రదర్శించే మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ తాజాగా నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని తయారుచేసింది. సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి విగ్రహాన్ని అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఉంచనున్నారు. దీనికి సంబందించిన ఓ వీడియోను మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. శ్రీదేవి విగ్రహం చూస్తుంటే మళ్ళీ ఆమె దిగివచ్చినట్టుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 4 ఉద‌యం శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు మేడమ్ టుస్సాడ్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ కార్య‌క్ర‌మం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ప్ర‌సారం కానుంది. బోని కపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరు కావడానికని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24, 2018న బాత్ ట‌బ్‌లో మునిగి మరణించిన సంగ‌తి తెలిసిందే.

Updated : 3 Sep 2019 2:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top