దీపావళి గిఫ్ట్.. భారత్ రానున్న మరో 3 రాఫెల్ జెట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళి గిఫ్ట్.. భారత్ రానున్న మరో 3 రాఫెల్ జెట్స్

October 28, 2020

Indian Air Force to get 3 more rafale fighter jets

భారత వైమానిక దళానికి త్వరలో మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. నవంబర్ మొదటి వారంలో ఫ్రాన్స్ నుంచి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వస్తాయని తెలుస్తోంది. ఇవి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలా విమానాశ్రయానికి చేరుకుంటాయి. 

గత జూలై 29న అబు దబీ మీదుగా 5 రాఫెల్స్ జెట్లు భారత్‌కు వచ్చిన సంగతి తెల్సిందే. సెప్టెంబర్ 10న అంబాలా ఎయిర్‌బోస్‌లో ఈ ఐదు రాఫెల్ జెట్లను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లె, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం భారత్‌కు 36 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ అప్పగించాల్సి ఉంది. 2021 ఏప్రిల్‌ నాటికి మరో 16 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు రానున్నాయి.