ఎయిరిండియాకు మహిళ సీఈఓ.. చరిత్రలో తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిరిండియాకు మహిళ సీఈఓ.. చరిత్రలో తొలిసారి

October 31, 2020

భారత ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిరిండియా కొత్త సీఈఓను నియమించింది. చరిత్రలో ఓ మహిళను సీఈఓగా నియమించింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ను ఎయిర్ ఇండియా ఛీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్‌ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

హర్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా విమాన భద్రత విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె స్థానంలో, ఎయిర్‌ ఇండియా నూతన ఈడిగా కెప్టెన్ నివేదా భాసిన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హర్‌ప్రీత్ సింగ్ 1988లో ఎయిర్‌ ఇండియాకు ఎంపికైన మొట్టమొదటి మహిళ పైలెట్‌. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమె విమానంలో ప్రయాణించలేక పోయినప్పటికి, విమానాల భద్రత విషయంలో చాలా చురుకుగా వ్యవహరించేవారు. ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్‌కు అధ్యక్షత వహిస్తున్నారు.