indian-american-entrepreneur-vivek-ramaswamy-announces-2024-presidential-bid
mictv telugu

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రామస్వామి

February 22, 2023

indian-american-entrepreneur-vivek-ramaswamy-announces-2024-presidential-bid

అమెరికాలో భారత సంతతి పరపతి పెరుగుతోంది. అక్కడ రాజకీయాల్లో మనవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మొన్న నిక్కీ హేలీ ఇప్పుడు మరో వ్యక్తి. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి సంపన్నుడు వివేక్ రామస్వామి నిలిచారు. ఈయన రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడనున్నారు. ఈయనొక ప్రముఖ వ్యాపారవేత్త. నిక్కీ హేలీ తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో వ్యక్తి రామస్వామి. ఇద్దరూ రిపబ్లికన్ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు.

అమెరికా ఆదర్శాలను నిలబెట్టేందుకే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని చెప్పారు రామస్వామి. ఈ ప్రకటన చేయడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రపంచంలో అమెరికాకు మొదటిస్థానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాని ఆయన తెలిపారు. అయితే దాని కంటే ముందు అమెరికా అంటే ఏంటో కనుక్కోవాలని, అలాగే చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును కూడా ఎదుర్కోవాలని అన్నారు. చైనా మీద అమెరికా ఆధారపడటం తగ్గిస్తానని చెప్పారు.

వివేక్ రామస్వామి అమెరికాలో ఓహాయో రాష్ట్రానికి చెందినవారు. ఆయన వయసు 37. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయారు. స్ట్రైవ్ అసెట్ మేనేజ్ మెంట్ అనే సంస్థను రామస్వామి స్థాపించారు. మెడికల్ ఫీల్డ్ లో రామస్వామికి మంచి పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్ ను కూడా ఏర్పాటు చేశారు. 2016 ఫోర్బ్స్ లెక్కల ప్రకారం వివేక్ ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు. సోషల్ మీడియాలో తనను తాను క్యాపటలిస్ట్, సిటిజెన్ గా చెప్పుకునే వివేక్ 40 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న సంపన్నుడిగా పేరు పొందారు.