Indian-American Foul-Mouthed Rant on Another Indian in California, Arrested
mictv telugu

డర్టీ హిందూ, ఆవు మూత్రం తాగేవాళ్లారా.. భారతీయ హిందువుపై సిక్కు తిట్లు

September 1, 2022

జాతి వివక్ష పరాయి దేశంలోనూ తప్పడం లేదు. భారతీయ సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్ల మధ్య మత వాగ్వాదం చోటుచేసుకుంది. వారిలో ఒకరు సిక్కు కాగా.. మరొకరు హిందువు. ‘డర్టీ హిందూ’ అంటూ సిక్కు మతస్థుడు హిందువు వ్యక్తిపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఆగస్ట్ 21న కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో ఈ ఘటన జరిగింది. 37 ఏళ్ల తేజిందర్ సింగ్ అనే వ్యక్తి.. కృష్ణన్ జయరామన్ ను అతి దారుణంగా దూషించాడు. జయరామన్ పై ఉమ్ము వేసి, అతి దారుణంగా దూషించాడు.

హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడాలంటూ ఘోరం అవమానించాడు. హిందువులు గోమూత్రం తాగుతారని, అసహ్యకరమైన వారని విచక్షణారహితంగా మాట్లాడాడు. అంతేకాదు తన చేతి కండలను చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశాడు. తాను ఎదురుతిరిగితే దాడి చేసే ప్రమాదం ఉందని భావించిన జయరామన్ పోలీసులకు కాల్ చేశాడు. వెంటనే వచ్చిన ఫ్రీమాంట్ పోలీసులు తేజిందర్ సింగ్ పై పౌర హక్కుల ఉల్లంఘన నేరాన్ని మోపుతూ కేసు నమోదు చేశారు.

అసహ్యకరమైన, ద్వేషపూరిత నేరాలను తాము సీరియస్ గా తీసుకుంటామని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సియాన్ వాషింగ్టన్ ప్రకటన విడుదల చేశారు. అన్ని మతాలకు చెందిన వారిని రక్షించేందుకే తామున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకరిపట్ల మరొకరు గౌరవభావంతో మసలుకోవాలని సూచించారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన యూఎస్ హౌస్ రిప్రజెంటేటివ్ రోహిత్ ఖన్నా ఈ ఘటనను ఖండించారు.