ముస్లింలపై వివక్ష వ్యాఖ్యలు మరో భారతీయుడికి ఉద్వాసస  - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలపై వివక్ష వ్యాఖ్యలు మరో భారతీయుడికి ఉద్వాసస 

May 20, 2020

Indian Angry on Islam

భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఓ భారతీయుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.  సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు ఆధారంగా అతన్ని ఓ మైనింగ్ సంస్థ నిర్ధాక్షణ్యంగా తొలగించివేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌‌లో ఇది చోటు చేసుకుంది. కాగా గతంలో కూడా ముగ్గురు ఉద్యోగులను కూడా ఇలాగే ఆ సంస్థ వేటు వేసింది. అతడు బిహార్‌కు చెందిన బ్రజ్ కిషోర్‌గా భారత రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ  సంఘటన సంచలనంగా మారింది.  ముస్లింలు కరోనా వైరస్ ను వ్యాపింపజేస్తున్నారని, ఢిల్లీ అల్లర్లు దేవుడి చలవ అని  కిశోర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. 

చప్రా ప్రాంతానికి చెందిన బ్రజ్ కిషోర్ గుప్తా రాస్ అల్ ఖైమాలో స్టీవెన్ రాక  కంపెనీలో పని చేస్తున్నాడు. అతడు ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతాలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కంపెనీకి దృష్టికి వెళ్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక నుంచి పనిలోకి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశం కాని దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడకూడదని గతంలో భారత రాయబార కార్యాలయం కూడా ఎన్ఆర్ఐలకు సూచించింది. అయినా కూడా బ్రజ్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేసి కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అయ్యింది.